AP | ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్..

AP | ప్రేమజంటల వీడియోలతో బ్లాక్‌మెయిల్..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా మాచర్లలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై శ్రీనివాస్‌పై తీవ్రమైన ఆరోపణలు రుజువవడంతో సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమజంటల వీడియోలు తీసి బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రేమజంటల వీడియోలు తీసి వారిని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. అంతేకాకుండా వీడియోలు చూపిస్తూ యువతులు, మహిళలను వేధిస్తున్నట్లు కూడా తేలింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అనంతరం విచారణ జరిపిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply