ఆరోగ్యమైన ఆహారంతోనే మెరుగైన సమాజం సాకారం

ఆరోగ్యమైన ఆహారంతోనే మెరుగైన సమాజం సాకారం

ప్రతి విద్యార్ధికి నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం
ప్రై-వేటు స్కూళ్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి
భోజనం, యూనిఫాం, తరగతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
మచిలీపట్నంలోని జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం – ఆంధ్రప్రభ : నాణ్యమైన భోజనం అందించడం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజం సాకారమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జెడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్ధుల నుండి అభిప్రాయాలు సేకరించారు. వారితో కలిసి భోజనం చేశారు. స్కూల్లో సదుపాయాలు, తరగతుల బోధనల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గారు కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాళల్లో ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. విద్యార్ధులకు రోజుకొక మెనూతో భోజనం అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు కూడా సంతోషంగా భోజనం చేయడం అత్యంత ఆనందంగా ఉంది.

పేద విద్యార్ధులు భోజనం లేక విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో అన్న ఎన్టీఆర్ గారు మద్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా ఈ స్థాయికి చేరుకోవడం సంతోషకరం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్దరించాం. మద్యాహ్న బోజనం కోసం ఏటా ఏకంగా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్ధులు కడుపునిండా తిని ఆరోగ్యంగా ఉండాలన్నదే మద్యాహ్న భోజన పథకం లక్ష్యం.

పిల్లలకు ఎన్సీఈఆర్టీ విద్యా విదానంలో సిలబస్ రూపొందించడం నుండి, అర్ధమయ్యే రీతిలో బోధన ఉండేలా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఏర్పాటు చేశాం. ఉపాధ్యాయుల కొరత లేకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16 వేల మందిని నియమించాం. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్దికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం ద్వారా విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాం.

నాలెడ్జి కలిగిన సమాజాన్ని రూపొందించేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాం. ప్రతి విద్యార్ధి ఉద్యోగ, ఉపాధి రంగంలో మెరుగైన అవకాశాలు దక్కించుకునేలా మార్పు చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్దేశ్యపూర్వకంగా విద్యార్ధుల్ని ఫెయిల్ చేసి ఇబ్బందులు పెట్టారు. ఎయిడెడ్ స్కూల్స్ ను దెబ్బతీశారు. స్కూల్స్ మెర్జింగ్ పేరుతో విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. కానీ నేడు ప్రభుత్వం ప్రతి విద్యార్ధికి మెరుగైన విద్య అందించే లక్ష్యంతో నిత్యం పని చేస్తోంది.

ఈ రోజు దేశ విదేశాల్లో ఇంత మంది తెలుగు వారు స్థిరపడి, ఐటీ రంగాన్ని శాసిస్తున్నారంటే.. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చర్యల ఫలితమే. ప్రస్తుతం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డేటా సెంటర్ల ద్వారా అవకాశాలను అందిపుచ్చుకునేలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. విద్యార్ధులు భవిష్యత్తును నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా సన్నద్దం కావాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధికి మాజీ విద్యార్ధులు కూడా సహకరించాలని, అప్పుడే అందరికీ విద్యను పంచే అవకాశం కలుగుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె దుర్గా ప్రసాద్, రూరల్ అధ్యక్షులు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply