పేదల కళ్ళల్లో ఆనందం…

పేదల కళ్ళల్లో ఆనందం…

ఘనంగా గృహ ప్రవేశాల ఉత్సవం..
లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్..

నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు టీడ్కో ఇల్లు ఇవ్వటం ఒక అదృష్టమని రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.రైతు నగరంలోని శిల్పా నగర్ నందు నిర్మించిన గృహాలను సోమవారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 2,50,893 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సొంత ఇల్లు పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, కోమలి హోటల్ మధు, మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి , పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, లబ్ధిదారులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply