AP | పండగ రోజు ప్రారంభోత్స‌వం

AP | పండగ రోజు ప్రారంభోత్స‌వం

AP |గుడివాడ, ఆంధ్రప్రభ : తెలుగు వారందరికీ ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ రోజు ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం సిపూడి గ్రామంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సంక్రాంతి పండుగ రోజు పర్యటించారు. గ్రామంలో రూ.20 ల‌క్ష‌ల‌తో నిర్మాణం పూర్తి చేసుకున్న కీ.శే గంజి రామదాసు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నిర్మించిన రామదాసు విగ్రహాన్ని ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. ముందుగా గ్రామానికి వచ్చిన నేతలకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ సైన్స్ టెక్నాలజీ బండి శ్రీనివాస్,ఆర్టీవో బాలసుబ్రమణ్యం, ఎమ్మార్వో కిరణ్, ఎంపీపీ గద్దె పుష్పరాణీ, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీపూడి సర్పంచ్ కలతోటి థామస్, తట్టివర్రు గ్రామ సర్పంచ్ గంజి శివయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరిపర్తి సుబ్బారావు, టిడిపి నాయకులు సూరపనేని రామకృష్ణ, రషీద్ బేగు, వంశీ, కొండవీటి ఫణి, కైలే కాళిదాస్, జువ్వనపుడి దుర్గారావు, గాలంకి జనార్దన్, కూరాకుల నాగరాజు, గంజి రాఘవేంద్ర, చప్పిడి భీమేశ్వరావు, బండి గోవర్ధన్ రావు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply