AP | హృదయ విదారక ఘటన..

AP | హృదయ విదారక ఘటన..

తల్లి మరణించిన ఐదు రోజులైనా బయటికి చెప్పని కుమార్తె

AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం పట్టణంలో విషాదకర సంఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. పోతేపల్లి శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నర్రా రూతమ్మ మరణించి ఐదు రోజులు అయినా, ఈ విషయం బయటకు తెలియకుండా ఉండటం స్థానికులను కలవరపరిచింది. మృతురాలి కుమార్తె సుమతి మతిస్థిమితం లేకపోవడంతో, తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఇంటికి వచ్చిన వారిపై రాళ్లు విసురుతూ అల్లరి చేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు మీడియాకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులు పరిస్థితిని పరిశీలించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Leave a Reply