రేపు హుండీ లెక్కింపు, వేలంపాటలు..

రేపు హుండీ లెక్కింపు, వేలంపాటలు..

మార్చి 24న సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం
భక్తులు, వ్యాపారులకు దేవస్థానం ఆహ్వానం

ఆంధ్రప్రభ, భవానిపురం : విజయవాడ లోని వన్ టౌన్ లో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో హుండీ లెక్కింపు కార్యక్రమం మరియు సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలంపాటలు మార్చి 24వ తేదీ మంగళవారం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి తెలిపారు. నగరంలోని వన్‌టౌన్ రథం సెంటర్‌లో ఉన్న ఈ పురాతన శివాలయంలో కోలువై ఉన్న దేవతామూర్తుల సన్నిధిలో హుండీల లెక్కింపు ప్రక్రియ నిర్వహించబడుతుంది. అదే రోజు వివిధ అంశాలకు సంబంధించి సీల్డ్ టెండర్లు స్వీకరించి, అనంతరం బహిరంగ వేలంపాటలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు, వ్యాపారులు నిర్ణీత సమయానికి హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థానం వర్గాలు సూచించాయి.

Leave a Reply