AP | కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా సుబ్బారావు
AP | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా విద్యాశాఖాధికారిగా యువి.సుబ్బారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా ఏడాదిన్నర కాలంపాటు పని చేసిన పీవీజె.రామారావును (PVJ Ramarao) గుంటూరు జిల్లా బోయపాలెం డైట్ కళాశాల ప్రిన్సిపల్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఎన్టీఆర్ జిల్లా డీఎస్ఈవోగా పని చేస్తున్న యువి.సుబ్బారావుకు జిల్లా విద్యాశాఖాధికారిగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు.

