రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే తాతయ్య…

రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే తాతయ్య…

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీరామ తాతయ్య
జగ్గయ్యపేటలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు సోదరభావం, శాంతి కోసం ఆకాంక్ష

జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో శాసనసభ్యుడు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్వదినాలు సమాజంలో ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందించే వేదికలని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణం కొనసాగాలని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కోరుకున్నారు.

Leave a Reply