అంగన్వాడి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము..

అంగన్వాడి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము..

అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

గుడివాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా…. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యం అయ్యిందని… ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు.

పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకు సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఏపీలో అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడి సోదరీమణులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగానే , అంగన్వాడీల జీతాల పెంపు సమస్య పరిష్కారం కొంత ఆలస్యం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే గతంలో అంగన్వాడీల జీతాలు పెరిగాయని, మరే ప్రభుత్వం వారి జీతాలు పెంచలేదని ఎమ్మెల్యే రాము గుర్తు చేశారు. అంగన్వాడి సోదరీమణుల కష్టం గుర్తించిన ఏకైక ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే రాము ఉద్ధాటించారు. ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర రావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టిడిపి నాయకులు డాక్టర్ గోర్జి సత్యనారాయణ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply