కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు..

కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు..

ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్
తిరువూరులో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన కేశినేని వెంకట్..
ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను, ఎంపీ కేశినేని చిన్ని సేవానిరతిని కొనియాడిన ప్రముఖులు

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు తెలుగుదేశం పార్టీ, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా ఆసువత్రి వైద్య బృందం సహకారంతో తిరువూరులో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తనయులు , యువ నేత కేశినేని వెంకట్ ఆదివారం ప్రారంభించారు. తిరువూరు పట్టణం మధిర రోడ్డు లోని ఆర్ సి ఎం చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వెంకట్ బాబు కు స్థానిక టిడిపి నాయకులు, పెద్దలు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలసి వైద్య శిబిరం ప్రారంభించిన వెంకట్ బాబు వైద్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని వెంకట్ బాబు మాట్లాడుతూ… కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాలలో రానున్న కాలంలో మరింతగా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు.

ఎంపీ కేశినేని శివనాధ్ ఆదేశాల మేరకు ప్రతి పది రోజులకు ఒక ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించేలా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. తిరువూరు లో మెడికల్ క్యాంపు నిర్వహణకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరంలో సాధారణ వ్యాధులతో పాటుగా క్యాన్సర్, కంటి, కిడ్నీ, దంత, వినికిడి తదితర ఆరోగ్య సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు జరుగుతాయని, ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని ) ఆదేశాలతో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలే కాకుండా మహిళలకు, యువతకు ఉపాధి కల్పన దిశగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మూడేళ్ల నుంచి ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఇకపై సైతం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ శావల దేవదత్ మాట్లాడుతూ… ప్రభుత్వపరంగానూ , కేశినేని ఫౌండేషన్ పరంగా ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా ఎంపీ కేశినేని శివనాద్ కు ముందు గుర్తుకు వచ్చే నియోజకవర్గం తిరువూరు కావడం సంతోషకరం అన్నారు . ప్రతి ప్రాంతంలోనూ నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాలు తిరువూరు లోని పవిత్ర ప్రార్థనా మందిరం నుంచి ప్రారంభం కావడం శుభపరిణామం అన్నారు. కేశినేని ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా 1200 మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారనీ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

ఎంపీ గా గెలిచిన తర్వాతే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు అనేక సేవా కార్యక్రమాలు కేశినేని చిన్ని చేశారన్నారు. ప్రజలకు వ్యక్తిగతంగా సేవ చేయాలనేదే ఎంపీ కేశినేని చిన్ని తలంపు అని, తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న యువ నాయకుడుగా కేశినేని వెంకట్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఎంపీ కేశనేని శివనాధ్ చిన్ని నాయకత్వంలో రానున్న మూడేళ్ల కాలంలో తిరువూరు నియోజక వర్గం మరింత అభివృద్ధి చెందటం ఖాయమన్నారు. తిరువూరు పట్టణ టిడిపి మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ….ప్రజలందరికీ మెరుగైన సేవలు అందాలనేది కేశినేని ఫౌండేషన్ లక్ష్యం అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా కేసినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని వెంకట్ బాబు ప్రజా సేవ చేయడంలో ముందుంటున్నారన్నారు.

కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర ఆసుపత్రి కిడ్నీ మ హార్ట్ వైద్య నిపుణులు డాక్టర్ కామినేని అచ్యుత బాబు మాట్లాడుతూ.. తిరువూరులో వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పగానే ఎంతో ప్రోత్సాహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్న వయసులోనే సేవా తత్పరతను అందిపుచ్చుకొని కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్ బాబును తెలుగు మహిళలు, తిరువూరు పట్టణ ప్రముఖులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు తాళ్లూరి రామారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, టీఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ ఎస్‌కె హుస్సేన్, శాలివాహన కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సత్యవతి, తిరువూరు మండల పార్టీ అధ్యక్షులు దుబ్బాకు వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ గద్దే వెంకటేశ్వరరావు, తిరువూరు అర్బన్ పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జి కె.శివరామకష్ణ , నడిం తిరువూరు పీఏసీసీ అధ్యక్షులు కంచి రఘు ప్రవీణ్, కౌన్సిలర్ ఎం.దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదాల హరిచరణ్ (కిట్టూ), తిరువూరు నియోజకవర్గ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వరరావు , బీసీ సెల్‌రాష్ట్ర నాయకులు కందిమళ్ల శేషగిరిరావు , వెంకటా చల దేవస్థానం ఛైర్మన్ పి.శ్రీను, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎన్.విజయ్, శివాలయం పాలక మండలి ఛైర్మన్ జంగాల మురళి , తెలుగు మహిళా సీనియర్ నాయకురాలు కె.రామకోటమ్మ, మైనార్టీ సెల్ నాయకులు ఎస్ కే హుస్సేన్, జనసేన నాయకులు లింగినేని సుధాకర్, రామిశెట్టి జగన్, పసుపులేటి రవీంద్ర , ఆర్‌సీఎం చర్చి పాస్టర్ రెవరెండ్ జంగము విజయ్‌కుమార్ తదితరులు పాల్గొనగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వందలాది మందికి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Leave a Reply