ఎమ్మెల్యే సంతాపం..

ఎమ్మెల్యే సంతాపం..

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం విశ్వనాధపల్లి గ్రామ మాజీ మునసబు విష్ణుభొట్ల సూర్యనారాయణ మృతికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. తన తండ్రి మండలి వెంకట కృష్ణారావుకు సన్నిహిత మిత్రునిగా, సదా తన ఉన్నతిని కోరుకున్న సూర్యనారాయణ మరణవార్త విని నిశ్చేష్టుడనైనట్లు తెలిపారు. దూరాన ఉండటంతో చివరి చూపు చూచే అవకాశం కూడా లేకపోవడం మరింత బాధాకరంగా ఉందన్నారు. వారి అంత్యక్రియలు దగ్గరుండి చేయించలేక పోయాననే బాధ జీవితాంతం ఉంటుందన్నారు. వారి కుటుంబంలో తనను ఒక సభ్యునిగా చూశారని తెలిపారు. రాజకీయ జీవితంలో చక్కటి సలహాలిచ్చి తనవెంట నిలిచారన్నారు. వివిధ పదవుల ద్వారా విశ్వనాధపల్లి గ్రామాభివృద్దికి విశేష కృషి చేశారని తెలిపారు. వారి ఆత్మశాంతికి ప్రార్దిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply