రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు..
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు మంత్రి తెలిపారు. హోలీ పండుగ అంటే చెడుపై మేలుకి జయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ అన్నారు. ఇది ప్రేమ, ఐక్యత, సంతోషం, స్నేహం అనే రంగులతో మన జీవితాలను అలంకరించే పర్వదినం అన్నారు. రకరకాల రంగులతో జీవితం రంగులమయం అవ్వాలని, సంతోషం – ఐక్యత – సఖ్యతలు నిండిన సమాజం నిర్మాణం వైపు అందరం అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
మరోసారి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
