AP | భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయం

AP | భక్తులతో పోటెత్తిన సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయం

AP | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కృష్ణా జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం నిమిత్తం దేవాలయానికి విచ్చేశారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులు భక్తులు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారి కోసం క్యూలైన్లను నిలబడ్డారు. మహిళలు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం రావడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిస్తాయి. పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

Leave a Reply