AP | పుప్పాల ఆంజనేయులు 12వ వర్ధంతి

AP | పుప్పాల ఆంజనేయులు 12వ వర్ధంతి

  • నివాళులర్పించిన ఏపీ ఎస్డబ్ల్యుసి చైర్మన్ రావి..రాజకీయ ప్రముఖులు

AP | గుడివాడ – ఆంధ్రప్రభ : పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దివంగత పుప్పాల ఆంజనేయులు 12వ వర్ధంతి కార్యక్రమాలను, మిత్రులు మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిమీద గల పుప్పాల ఆంజనేయులు విగ్రహానికి ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి,పలు రాజకీయ పార్టీల ముఖులు,అభిమానులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజకీయంగా పుప్పాల ఆంజనేయులు చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. 12 ఏళ్లు గడిచిన ఆయన అభిమానులు, సన్నిహితులు, శిష్యులు ఆంజనేయులను మరవకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని రావి వెంకటేశ్వరరావు కొనియాడారు.

గుడివాడ రాజకీయాల్లో ఆంజనేయులకు ప్రత్యేక స్థానం ఉంటుందని సీనియర్ టిడిపి నాయకులు బాబ్జి మరియు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోకరకొండ బలరాం ,జోగా సూర్య ప్రకాశరావు, సింగిరెడ్డి గగారిన్,విరిశెట్టి నరసింహారావు, సానా భోగేశ్వరరావు,మాజీ ఎంపీపీలు గుత్తా చంటి,గోగం సురేష్ , టిడిపి నాయకులు పండ్రాజు సాంబయ్య, దేవాది నాగేశ్వరరావు,కోడూరు ప్రభు, కుంచనపల్లి సుబ్రహ్మణ్యం, వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం (అబూ),వైసీపీ నాయకులు గోళ్ళ సోమేశ్వరరావు,కాపు సేవా సమితి నాయకులు సుంకర గాంధీ, పంచకర్ల వెంకట్,ss నాయుడు, జనసేన నాయకులు వాడరేవు రఘు, కోయిలాపు రాము,స్వర్గీయ ఆంజనేయులు సన్నిహితులు గోకరకొండ హరిబాబు, పురుషోత్తం,ఎన్.ఎస్.ఆర్ రాజా, పున్నం మోహన్, వడ్డే దానయ్య, ఆంజనేయులు సన్నిహితులు మిత్రులు శిష్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply