AP | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ. 9.35 కోట్లు…

AP | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ. 9.35 కోట్లు…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
వెంకటాపురంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన.

AP | జి.కొండూరు, ఆంధ్రప్రభ : మైలవరం నియోజకవర్గంలో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి 9.35 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. జి.కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో రూ.36 లక్షలతో నిర్మించనున్న గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో పేదలకు వివిధ సంక్షేమ పథకాల నిమిత్తం రూ.429.60 కోట్లు చెల్లించినట్లు వివరించారు.

AP

అలాగే అభివృద్ధికి రూ.151.29 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఎల్.ఓ.సీ ల రూపేణా 12.94 కోట్ల రూపాయలు అందించామన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఏపీ ప్రగతికి కృషి చేస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఆపన్నులకు అండగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply