AP | ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

AP | ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
AP | గన్నవరం – ఆంధ్రప్రభ : గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓ షాపులో ఇవాళ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిత్యావసర వస్తువుల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
