AP | కూటమి నేతల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలి..

AP | కూటమి నేతల దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలి..
తక్షణమే అరెస్టు చేయాలి..
జగ్గయ్యపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
AP | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూటమి ప్రభుత్వ నాయకులు రాష్ట్రంలో వైసీపీ నేతలపై నేరాలు, దాడులు, అశ్రద్ధా ఘటనలపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తున్న సందర్భంగా నియోజకవర్గ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, స్థానిక ప్రజల భద్రత, పార్టీ నేతల రక్షణకు కట్టుబడి ఈ చర్యను చేపట్టినట్లు తెలిపారు. అలాగే, తిరుమల లడ్డు ప్రసాదంపై జరుగుతున్న అసత్య ప్రచారం, అవమానం గురించి పోలీసులు పర్యవేక్షించి సరిగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మండల అధ్యక్షులు బూడిద నరసింహారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, జిల్లా పంచాయతీ రాజ్ కార్యదర్శి శీలం మంగరావు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు ఓర్స్ రాజు, నాయకులు లాహోరీ బద్దు నాయక్, మున్సిపల్ వింగ్ అన్నేపాక మురళి, పట్టణ యువజన విభాగ కార్యదర్శి గొట్టిపాళ్ళ సురేష్, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడి కందుల సత్యనారాయణ, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, పట్టణ సోషల్ మీడియా సయ్యద్ ఆలీ, పట్టణ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు దారెల్లి మహేష్, మండల స్టూడెంట్ వింగ్ బరిగెల వినోద్, దారెల్లి రాజు, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదు ద్వారా స్థానిక ప్రజల భద్రత, పార్టీ కార్యకర్తల రక్షణకు ప్రభుత్వం, పోలీసులు కట్టుబడి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
