Anupama Parmeshwaran | సైకలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..?

Anupama Parmeshwaran | సైకలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..?
Anupama Parmeshwaran | సైకలాజికల్ థ్రిల్లర్‌లో అనుపమ పరమేశ్వరన్
పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే లక్ష్యం
చరణ్–సుకుమార్ మూవీ ప్రచారంపై క్లారిటీ ఏంటి?
ఆర్జే షాన్ దర్శకత్వంలో ఇంటెన్స్ థ్రిల్లర్
డిజిటల్ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్ కాంబో
పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రయత్నం
అనుపమకు ఈ మూవీ బిగ్ బ్రేక్ అవుతుందా?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనుపమ పరమేశ్వరన్.. పాత్రకు తగ్గట్టుగా నటిస్తూ.. ఆడియన్స్ ని మెప్పించింది. తెలుగులో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. ముఖ్యంగా.. అనుపమ మాత్రం పర్ ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు.. డిఫరెంట్ స్టోరీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని అనౌన్స్ చేసింది. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది..?
Anupama Parmeshwaran | చరణ్ మూవీలో అనుపమ..?

అనుపమ.. అఆ, ప్రేమమ్, శతమానంభవతి, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించి సక్సెస్ సాధించింది. ఈ మలయాళ బ్యూటీ ఏ పాత్రలో అయినా.. నటించి మెప్పించగలదు అనే పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్ కి దగ్గరైంది. అసలు రంగస్థలం సినిమాలో సమంత పాత్రను అనుపమనే చేయాలి. ఆ పాత్ర చేసుంటే.. అనుపమ కెరీర్ మరోలా ఉండేది. ఇప్పుడు సుకుమార్, చరణ్ మూవీలో అనుపమ నటించనున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీని గురించి క్లారిటీ రావాల్సివుంది.
Anupama Parmeshwaran | డిఫరెంట్ సైకలాజికల్ మూవీ..

ఇదిలా ఉంటే.. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్, బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ సంయుక్తంగా ఓ సినిమాని ప్రకటించాయి. ఈ చిత్రానికి ఆర్జే షాన్ దర్శకత్వం వహించనున్నారు. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియోతో భాగస్వామ్యంగా ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. గతంలో అనుపమ–షాన్ కాంబినేషన్లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే జోడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇద్దరి కాంబోలో డిజిటల్ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్ పై ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానుంది.
Anupama Parmeshwaran | పాన్ ఇండియా ప్రయత్నం..

ఇటీవలే జటాధర మూవీని నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఈ కొత్త థ్రిల్లర్ ప్రాజెక్ట్‌తో అనుపమ బిగ్ సక్సెస్ సాధించడం ఖాయమని, ఇందులో ఆమె నటనలోని వైవిధ్యం చూస్తారని టీమ్ చెబుతున్నారు. మరి.. అనుపమ ఆశించిన బిగ్ సక్సెస్ ఈ సినిమా ఇస్తుందేమో చూడాలి.
