Anil Ravipudi | నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే..

Anil Ravipudi | నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హిట్ మిషన్ అనిల్ రావిపూడి.. వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు వచ్చే సంక్రాంతికి కూడా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడు. అయితే.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా ఇదే అంటూ హీరో ఎవరో… కథ ఏంటో.. ఎవరెవరు నటించబోతున్నారో.. ప్రచారంలోకి వచ్చింది. ప్రచారంలో ఉన్న వార్తల పై అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ.. అనిల్ ఏమన్నాడు..?

Anil Ravipudi

Anil Ravipudi | అనిల్ స్టైలే వేరు..

అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారని.. ఇందులో ఫహిద్ ఫాజిల్ ఓ ముఖ్యపాత్ర చేయబోతున్నారని.. ప్రచారం జరుగుతుంది. అంతే కాదండోయ్.. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో తోడల్లుల్లు కథను చెబితే.. ఇప్పుడు బావ బావమరిది కథను చెప్పబోతున్నారని వార్తలు వచ్చాయి. వెంకీ, ఫహిద్ ఫాజిల్ బావ బావమరిదిగా నటించబోతున్నట్టు న్యూస్ (News) వైరల్ అయ్యింది. వెంకీకి జంటగా పూజా హేగ్డే, కీర్తి సురేష్ నటిస్తుంటే.. ఫహిద్ ఫాజిల్ కు జంటగా ఆషికా రంగనాథ్ నటించనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ ప్ర‌చారం రోజు రోజుకూ పెరుగుతుండడంతో అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.

Anil Ravipudi

Anil Ravipudi | వైరలైన అనిల్ ట్వీట్..

అనిల్ రావిపూడి ఫ‌న్నీగా ఒక పోస్టు పెట్టాడు. నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటినటులు, కధ, టైటిల్ కూడా పెట్టేసారు. ఈ ఫ్లో చూస్తుంటే ..యాక్షన్.. కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను.. అలాగే నేను చేసే సినిమా (Movie) ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో… నిజమైన పూర్తి వివరాలు… మీకు అందిస్తాం అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. అయితే.. ఇదంతా అనిల్ ప్లాన్ అని.. లీకులు ఇచ్చేది అనిల్ రావిపూడినే అని.. ఆతర్వాత కౌంటర్ పోస్టులు పెట్టడం కూడా తనే చేస్తాడని.. ఇలా చేయడం ద్వారా ఎక్కువ బజ్ వస్తుందనేది స్ట్రాటజీ అని సరదాగా పోస్టులు పెడుతున్నారు. మరి.. త్వరలో అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తాడో చూడాలి.

CLICK HERE TO READ క్రేజీ స్టార్‌తో హీరోయిన్ ఇమాన్వి సినిమా?

CLICK HERE TO READ MORE

Leave a Reply