Anil Ravipudi | నాగ్ తో అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు…?

Anil Ravipudi | నాగ్ తో అనిల్ రావిపూడి సినిమా ఎప్పుడు…?
Anil Ravipudi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పటాస్ సినిమా నుంచి ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా తెరకెక్కించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ ఫుల్ గా.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. మరో బ్లాక్ బస్టర్ అందించాడు అంటూ అనిల్ ని అందరూ అభినందిస్తున్నారు. అయితే.. నాగార్జునతో సినిమా చేస్తానని అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి అక్కినేని అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. అయితే.. అనిల్ రావిపూడికి అక్కినేని అభిమానులు ఓ రిక్వెస్ట్ పెడుతున్నారు. ఇంతకీ.. ఏంటా రిక్వెస్ట్…?
Anil Ravipudi | మెగాస్టార్.. సూపర్..
వరుసగా హిట్ సినిమాలు ఇస్తూ.. హిట్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఇప్పటికే విక్టరీ వెంకటేష్ తో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి అంటూ మరో హిట్ మూవీ (Hit Movie) అందించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్‌ను హ్యాండిల్ చేసిన విధానం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిల్.. నువ్వు సూపర్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు.

Anil Ravipudi | నాగ్ తో.. హలో బ్రదర్ తరహా మూవీ..
ఇదిలా ఉంటే.. ఆ నలుగురులో.. (చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్) నాగార్జునతో సినిమా చేస్తే.. అరుదైన రికార్డ్ తన సొంతం అవుతుందని.. త్వరలో నాగార్జునతో సినిమా చేస్తానని అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. ఈ నేపధ్యంలో అక్కినేని అభిమానులు అనిల్ రావిపూడి ముందు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు. అది ఏంటంటే.. నాగార్జున (Nagarjuna) హీరోగా హలో బ్రదర్ తరహా ఫుల్ లెంగ్త్ కామిక్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. నాగ్ స్టైల్‌కు అనిల్ కామెడీ టైమింగ్ సరిగ్గా సరిపోతుంది అంటున్నారు. అయితే.. అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయాలి. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేయాలి. ఎప్పుడు నాగ్ తో సినిమా చేస్తాడో క్లారిటీ లేదు కానీ.. అక్కినేని అభిమానులు కోరుకున్నట్టుగా హలో బ్రదర్ తరహా ఎంటర్ టైనర్ చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టరే అనే టాక్ వినిపిస్తోంది.

