కూతురు పై కోపంతో…
కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని కుటుంబ సభ్యులు.. అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. అసలు ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం మండలం కక్కర్ వాడలోని ఈ సంఘటన జరిగింది. ఆ గ్రామంలో విఠల్ కూతురు అదే గ్రామానికి చెందిన బోయిన నగేష్ ని ప్రేమించింది. నగేష్ కూడా ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అయితే.. వీరివురి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. కన్న కూతురు తనకు ఇష్టం లేకపోయినా.. ప్రేమ వివాహం చేసుకోవడం ఆగ్రహంతో ఊగిపోయాడు. కుమారుడు పాండుతో కలిసి నగేష్ తండ్రి పై ఘోరంగా దాడి చేసి ఇంటికి నిప్పుపెట్టారు.

