Anganwadi | చిన్నారులకు యూనిఫామ్‌లు, షూస్ పంపిణీ..

Anganwadi | చిన్నారులకు యూనిఫామ్‌లు, షూస్ పంపిణీ..
Anganwadi, మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో ఉన్న అంగన్వాడీ–2 కేంద్రంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ యువ నాయకుడు మండలి వెంకట్రావు (వెంకట్రామ్) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది.
పెదప్రోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు కాకి శ్రీనివాసరావు జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు పెదప్రోలు తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి కాకి అశోక్ సహకారంతో అంగన్వాడీ చిన్నారులకు స్కూలు యూనిఫామ్‌లు, బాగులు, షూస్, బెల్టులు, పలకలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పని చేస్తున్న కాకి నాగలక్ష్మి తిరుపతమ్మ సమక్షంలో, వాటిని జనసేన యువ నాయకుడు మండలి వెంకట్రావు చేతుల మీదుగా పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు బిస్కెట్లు, స్వీట్స్ కూడా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండలి వెంకట్రావు మాట్లాడుతూ.. పేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న ప్రాథమిక విద్య, పోషకాహారం పిల్లల శారీరక–మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతాయని తెలిపారు. అనంతరం పితృ వియోగానికి గురైన కాకి అశోక్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కే. కొత్తపాలెం పిఎసిఎస్ అధ్యక్షులు, జనసేన మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, పెదప్రోలు మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు యడ్లపల్లి లక్ష్మణరావు, యడ్ల శ్రీనివాసరావు, పెదప్రోలు జనసేన పార్టీ అధ్యక్షులు బాసు శ్రీనివాసరావు, కూరేటి రాఘవులు, గూడపాటి నాగ శ్రీను, నున్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
