Anganwadi Building | గ్రామాబివృద్ధే లక్ష్యం
- బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ సుంకరి లక్ష్మి గాంధీ
Anganwadi Building | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భీమ్‌గల్ మండల్ పురాణిపేట్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ(BRS party) సర్పంచ్ గా బలపరిచిన అభ్యర్థిని సుంకరి లక్ష్మీ గాంధీ తెలిపారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ… గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన వెంటనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.
అలాగే అంగన్వాడీ బిల్డింగ్(Anganwadi Building ని చేయిస్తా, విలేజ్ హెల్త్ సెంటర్ గా ప్రజల సౌకర్యం కల్పిస్తానన్నారు. గ్రామంలో ఏ కుల మతాల వారికైనా ఆడబిడ్డ పుట్టగానే రూ.5వేలను సాకారాన్ని తల్లి అకౌంట్ లో ఫిక్స్ డిపాజిట్ చేస్తానని హామీ, నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి జరిగితే తన వంతు సహాయంగా రూ.10000లు ఇస్తానని హామీ కల్పిస్తూ గ్రామంలో ఎక్కడైనా నీరు, రోడ్డు, విద్యుత్ సమస్యల పరిష్కారం(Solution to electricity problems) కోసం నిరంతర కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో వస్తున్న మిషన్ భగీరథ వాటర్ పూర్తిగా రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు.. గెలిపించిన వెంటనే మిషన్ భగీరథ నీటిని కూడా అందిస్తామని, మీ అమూల్యమైన ఓటు లేడీ పర్సు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు.

