ఏం జరిగిందో…?

ఏం జరిగిందో…?

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. రొళ్ల మండలం హెచ్‌.టి హళ్లి వడ్రహట్టి గ్రామానికి చెందిన వీరేశ్ తాపీమేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన వీరేశ్.. భార్య లక్ష్మితో తరచూ గొడవపడేవాడు. దాంతో ఇంటి నుంచి తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు రచన, రోహిణి బయటకు వెళ్లిపోయారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మద్యానికి బానిసైన వీరేశ్‌.. భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న ఇంట్లో మరోసారి గొడవ జరిగింది. అదేరోజు రాత్రి ఇంటి నుంచి సుబ్బమ్మ, లక్ష్మి, రోహిణి, రచన బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి బంధువులు వెతుకుతున్నా… వారి ఆచూకీ లభించలేదు. దీంతో మార్చి 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గౌతమి తెలిపారు. వీరేశ్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. అయితే వీరు ఎక్కడున్నారనేది సస్పెన్స్ గా మారింది.

Leave a Reply