Andhraprabha | అందరి పత్రిక ఆంధ్రప్రభ

Andhraprabha | అందరి పత్రిక ఆంధ్రప్రభ

  • డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్

Andhraprabha | వికారాబాద్, ఆంధ్రప్రభ : అందరి పత్రిక ఆంధ్రప్రభ అని, ఎవరికీ పక్షపాతం వహించకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుంటుందని డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్ పేర్కొన్నారు. ఇవాళ‌ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ తండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రిక(Andhraprabha Daily Newspaper) 2026 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించకుండా ప్రజల కోసం సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న దినపత్రిక ఆంధ్రప్రభ అని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రభ మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ వికారాబాద్ పీసీ ఇంచార్జ్ ఫ్యాట రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డి, నాయకులు రవి నాయక్, పరశురాం నాయక్, మాజీ కౌన్సిలర్ జమున భాయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply