Andhra Prabha | నిజాలను నిర్భయంగా..

Andhra Prabha | నిజాలను నిర్భయంగా..
- అందరూ మెచ్చే ఆంధ్రప్రభ
- నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి
Andhra Prabha | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ పత్రిక చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ మెచ్చే విధంగా అందరి అభిమానాన్ని చూరగొన్నదని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ రోజు నంద్యాలలో ఆమె ఆంధ్రప్రభ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. నేటి రాజకీయాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయ సేకరణ మార్గదర్శకంగా ఆంధ్రప్రభ లో వచ్చే కథనాలు ఆకట్టుకుంటున్నాయన్నారు.
ఆంధ్రప్రభ దినపత్రికలో ఎడిటోరియల్ పేజీ తోపాటు మానవీయ కోణంలోనూ రాజకీయ కథనాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంటాయన్నారు. ఆంధ్రప్రభ నూతనంగా అమలుపరిచే విధంగా వెబ్ పేజీ, స్మార్ట్ పేజీ, సాయంత్రం ఎడిషన్, ఆధ్యాత్మిక శోభ, ఆంధ్రప్రభ టీవీని కూడా ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎండి ముత్తా గౌతమ్ ఆధ్వర్యంలో చీఫ్ జనరల్ మేనేజర్ పసునూరి భాస్కర్ సారథ్యంలో ఆంధ్రప్రభ అందరికి దేశ రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా వార్తలు ఇవ్వడం అభినందనీయం అన్నారు.
ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలో రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, డెస్క్ ఇంచార్జ్ మధుల నిరంతర కృషితో రైతులు, ప్రజల కష్టాలను అధికారుల దృష్టికి తీసుకురావటంలో ఆంధ్రప్రభ ముందు ఉండటం విశేషమని కొనియాడారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నంద్యాల బ్యూరో ఇంచార్జ్ జయప్రకాష్, సర్క్యులేషన్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి, ఆర్‌సీ ఇంచార్జ్ పిట్టం నాగవర్ధన్ రెడ్డి, గోస్పాడు రిపోర్టర్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల రిపోర్టర్లు, రమణారెడ్డి, ప్రతాపరెడ్డి రంగా, కనకరాజు, తదితరులు పాల్గొన్నారు.
