ANDHRA PRABHA | క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

ANDHRA PRABHA | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఇవాళ హైదరాబాద్ లో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పత్రికలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని, ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా దినపత్రికలు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ సమీ, వహిదొద్దీన్, మనోహర్ రెడ్డి, మదుసుధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
