అనంతలో ఈవ్ టీజర్ గోల

  • అరదండాలతో జైలుకు తరలింపు

( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : లేడీ డాక్టరమ్మకు ఈవ్ టీజింగ్ (Eve teasing) తప్పలేదు. తనను ప్రేమించాలని వేధిస్తున్న రోమియోను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం టూ టౌన్ సీఐ యాదవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం సిండికేట్ నగర్ కు చెందిన గిద్దలూరి మోహన్ సాయి (27) ఎస్ ఎస్ బీ ఎన్ కాలేజీ లో బీకామ్ చదివాడు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.

ఈ నెల 13న అనారోగ్యంగా ఉందని, తనకు దగ్గు వస్తోందని మోహన్ సాయి అనంతపురం (Anantapur) ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. లో ఎమర్జెన్సీ వార్డు లో హౌస్ సర్జన్ గా పని చేస్తున్న ఓ లేడీ డాక్టర్ పై కన్నువేశాడు. తనను ప్రేమించాలని వెంటపడి వేధిస్తున్నాడు. ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ కెఎల్ సుబ్రమణ్యం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈవ్ టీజర్ ను గుర్తించి శుక్రవారం (20.09.25) ఉదయం అరెస్ట్ చేసి రిమాండు కు తరలించారు.

Leave a Reply