milk | అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ సేవలు అమోఘం

మిల్క్ బ్యాంక్‌కు ఆటోక్లేవ్ బిన్ బహూకరణ
దాత డాక్టర్ జగదీశ్‌ను అభినందించిన డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ గుజ్జల హేమలత

milk | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ అందిస్తున్న సేవలు అమోఘ‌మ‌ని పాథాలజీ విభాగం డాక్టర్ జగదీశ్ అన్నారు. డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ గుజ్జుల హేమలత ఆధ్వర్యంలో అనతికాలంలోనే ఇక్కడి మదర్స్ మిల్క్ బ్యాంక్ లక్ష్యానికి మించి పాలను సేకరించి నవజాత శిశువులకు, పాలు లేని శిశువులకు అందిస్తుండడం గొప్ప కార్యంగా ఆయన పేర్కొన్నారు. అందుకు తనవంతు సాయంగా మిల్క్ బ్యాంక్ కు ఏదో ఒక సాయం చేయాలని భావించినట్లు తెలిపారు. మిల్క్ బ్యాంక్ కు ఉపయోగపడే స్టెరిలైజేషన్ చేసిన ఫీడింగ్ బాటిళ్లను నిల్వ చేసే ఆటోక్లేవ్ బిన్ ను ఇవ్వాలని నిర్ణయించి బహూకరిస్తున్నట్లు వివరించారు.

పాలు లేని శిశువుల ఆకలిబాధ తీర్చే బృహత్ కార్యాన్ని తన భుజస్కందాలపై వేసుకున్న డాక్టర్ హేమలతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మిల్క్ బ్యాంక్ ప్రారంభించినప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా పాల కొరత రాకుండా చూసుకోవడంతో పాటు తల్లులకు అవగాహన కల్పిస్తూ.. శిశువుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతగా దోహదపడుతాయో వివరిస్తూ చైతన్యం తీసుకురావడం అంత ఆషామాషీ కాదన్నారు. కొందరు తల్లులు ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి వచ్చి పాలు ఇవ్వలేమని చెబితే.. ఎంత దూరమైన సరే తన సొంత కారులో, సొంత ఖర్చులతో వెళ్లి, పాలు సేకరిస్తున్న డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత కృషిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply