Anaganaga Oka Raju | సంక్రాంతి బరిలో నవీన్..

మారి సెల్వరాజ్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నవీన్ చివరిసారిగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో కనిపించాడు, ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు నవీన్ నుండి మరో సినిమా రాలేదు. అయితే, ‘అనగనగ ఓకే రాజు’ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది, కానీ నవీన్ కు గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

అయితే, ఈ సినిమా విడుదల గురించి ఇటీవల ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో విడుదల అవుతుందని తెలుస్తుంది. ‘అనగనగ ఒక రాజు’ సినిమాని జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి సీజ‌న్ లో ఈ సినిమా వ‌స్తే అన‌గ‌న‌గా ఒక రాజుకు మంచి థియేట్రిక‌ల్ ర‌న్ ద‌క్కే ఛాన్సుంది.

ఈ సినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో సూర్య‌దేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్రీ వెడ్డింగ్ వీడియో రూపంలో గ్లింప్స్ ను రెడీ చేయ‌గా, అందులో న‌వీన్ కామెడీ టైమింగ్ మ‌రోసారి అంద‌రినీ ఆక‌ట్టుకుని సినిమాపై మంచి బ‌జ్ ను పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *