సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం

సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు .. అక్కచెల్లెళ్లకు సన్మానం
జన్నారం, ఆంధ్రప్రభ : సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు సాధించిన మండలంలోని పొనకల్ గాంధీనగర్ కు చెందిన అక్క,చెల్లెళ్లను పలువురు శాలువాలు కప్పి సన్మానించారు.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్ వాసి బొమ్మిడి రాజేందర్-సుజాత దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావ్యరాణి, ప్రవళికలు సీఐఎస్ఎఫ్, ఐబీసీఎఫ్ సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఒకరు ఢిల్లీలో,మరొకరు జమ్మూ కాశ్మీర్ ఉద్యోగంలో చేరారు.
ఇంటికి వచ్చిన ఆ ఇరువురు ఉద్యోగులను హరిత రిసార్ట్ ఆవరణలో ఆ రిసార్ట్ మేనేజర్ వీరేందర్ శాలువాలు కప్పి సన్మానించారు. అదే ఉద్యోగులను మహేంద్ర యువజన సంఘం అధ్యక్షుడు సంద కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిలువేరి సుధీర్ కుమార్, గౌరవాధ్యక్షులు పర్ల శంకర్,పోతు సురేష్ శాలువాలు కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పలువురు హరిత రిసార్ట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


