America | రాహుల్‌ గాంధీ అమెరికా టూర్.. షెడ్యూల్ ఖరారు !

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఆయ‌న‌ ఈ నెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు.

ఆ పార్టీ నేత పవన్‌ ఖేడా ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్‌ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్‌ ఐలాండ్‌లోని బ్రౌన్‌ యూనివర్సిటీని సందర్శిస్తారన్నారు.

ఆ వర్సిటీలోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యులతోనూ సమావేశమవుతారని వెల్లడిరచారు.

Leave a Reply