వాషింగ్టన్ డిసి – పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారత విద్యార్ధి రంజని శ్రీనివాసన్ వీసాను అమెరిక ప్రభుత్వం రద్దు చేసింది.. హింస, ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నారంటూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఈ నెల 5న వీసాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్వచ్ఛందంగా అమెరికాను వదిలిపెట్టారు.
కాగా, వీసా రద్దు చేయడంతో అధికారులు తనపై చర్యలు తీసుకుని మిలటరీ విమానంలో భారత్‌కు పంపకుండా జాగ్రత్తలు తీసుకుంది రంజని. స్వచ్ఛందంగా ఆమె ఆమెరికాను విడిచిపెట్టిన రంజని భారత్ కు చేరుకున్నారు. ఇది ఇలా ఉంటే శ్రీనివాసన్ కొలంబియా యూనివర్సిటీలోని అర్బన్ ప్లానింగ్‌లో డాక్టోరల్ విద్యార్థిని. స్కూల్ వెబ్సైట్ ప్రకారం ఆమె కొలంబియా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అండ్ ప్రెజెర్వేషన్లో రీసెర్చ్ చేస్తున్నారు. అంతకుముందు ఆమె అహ్మదాబాద్‌లోని సీపీఈటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అలాగే, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.