TG | ఇంజనీరింగ్‌ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాల్లో సవరణలు..

ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యా సంస్థల్లో ఉన్న మొత్తం సీట్లను (85 శాతం) తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారు. 15 శాతం సీట్లను భర్తీ చేసేందుకు నాలుగు రకాల అర్హతలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా మార్గదర్శకాలు

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు, అధికారుల పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములు 15 శాతం కోటా సీట్లలో ప్రవేశం పొందవచ్చని రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది.

ఈ కోటాలో తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు అర్హులని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో 15 శాతం స్థానికేతర కోటాలో ప్రవేశం కావాలంటే తెలంగాణ లో ఖచ్చితంగా పదేళ్ళు చదివి ఉండాలన్న నిబంధన పెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 సెక్షన్‌ 95 ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ , ప్రయివేట్‌, ఎయిడెడ్ , ఆన్‌ ఎయిడెడ్‌ ఉన్నత విద్యా సంస్థలు, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో 15 శాతం స్థానికేతర కోటా సీట్లను 371డ్ఖి ప్రకారం పదేళ్ళ పాటు భర్తీ చేశామని ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *