దండేపల్లిలో పూర్వ విద్యార్థుల సంద‌డి..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2007-08 ప‌దో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, మండల కేంద్రంలో ని భారతి విద్యానికేతన్ ప్రయివేటు పాఠశాలలో2006-07 ప‌దో తరగతి చదివిన విద్యార్థులు ఒక్కటై పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.

చదువులు ముగించుకొని భవిష్యత్‌ను వెతుక్కుంటూ వెళ్లిపోయిన విద్యార్థులంతా ఒకేచోట చేరి సందడి చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా ప‌లుకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తరువాత ఒకేచోట కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం గురువులను శాలువలు క‌ప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply