పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని వివేకానంద విద్యా మందిర్ 2005- 2006 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ను స్థానిక ఎన్ ఎస్ స్పోర్ట్స్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాటి వివేకానంద పాఠశాల క్రమశిక్షణకు మారుపేరని గుర్తు చేశారు.

అప్పటి అధ్యాపక బృందము నేర్పిన విద్యాబుద్ధులతోటి మంచి స్థాయిలో ఉన్నట్లు వారి అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి ముందుగా మృతి చెందిన నాగవెల్లి నాగభూషణం, జయశ్రీ, నాగవెల్లి రఘుమోహన్, అశోక్, జనార్దన్ తో పాటు, పూర్వ విద్యార్థులు గంట దిలీప్ రెడ్డి, కొణతం నిశాంత్ రెడ్డి లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం బిట్ల ఆనంద్, సురిగల రామచంద్రు, బాసాని రాములు, పోలోజు వెంకటేష్, మాశెట్టి వెంకన్న, నాగవెల్లి మాధవ్, నాగవెల్లి భార్గవ్, నాగవెల్లి రాజలక్ష్మి, రాజిడి జ్యోతి, ఎండి కుబ్రాభి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply