అమ్మకు అక్షరమాల..
వాజేడు, ఆంధ్రప్రభ : వాజేడు మండలం మండల సమైక్య విద్యాశాఖ, డీఆర్డీఏ(DRDA) సమన్వయంతో సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ఎంఈఓ తేజవత్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహిళా సంఘాలకు రిసోర్స్ పర్సన్స్ లతో ఒకరోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉల్లాస్ టాస్ జిల్లా సమన్వయకర్త పీర్ల కృష్ణ బాబు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అమ్మకు అక్షరమాల అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అనివార్య కారణాల వల్ల చదువుకు దూరమైన పెద్దవారిని, మహిళలను(women) మరలా చదువు వైపు ప్రోత్సహించి దీని ద్వారా వయోజనులను వృద్ధిలోకి తీసుకురావడం జరుగుతుందని తెలియజేసారు. ఎంఈఓ మాట్లాడుతూ.. మహిళల్లో అక్షర జ్యోతులు(Akshara Jyothi) వెలిగించాలని ప్రభుత్వం సంకల్పించింది. నిరక్షరాస్యత నిర్మూలన అర్ధంతరంగా చదువు మానేసిన వారికి విద్యను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యచరణ చేశాయని తెలియజేశారు.
వాజేడు మండలంలో లెర్నర్స్1449(Learners1449), వాలంటీర్స్177 మందిని గుర్తించి మ్యాచింగ్ బ్యాచ్ చేసి ఒక వాలంటరీకి పదిమంది లెర్నర్లను విభజన చేసి విద్యను అందించే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏపీఎం సతీష్ మాట్లాడుతూ.. మండలంలో సంపూర్ణ అక్షరాస్యత ఆశయంగా ప్రత్యేక కార్యచరణతో మండల నిరక్ష రాశులను(Niraksha Rasu) గుర్తించి ఈ ప్రక్రియను చేపడతామని మండల విద్యాశాఖతో పాటు గ్రామీణ అభివృద్ధి శాఖల సహకారంతో ముందుకు వెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎస్ రాజేశ్వరి, సునీత సీసీలు మల్లీశ్వరి, వెంకటలక్ష్మి, సత్యనారాయణ, అకౌంటెంట్ భవాని, వివో ఏలు, వివో, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.

