చదువుతో పాటు పరిశోధనలపై దృష్టి పెట్టాలి..

చదువుతో పాటు పరిశోధనలపై దృష్టి పెట్టాలి..
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : భవిష్యత్తులో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఆలోచనలు, పరిశోధనల పై దృష్టి పెట్టాలని సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐ రాజశ్రీ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ సమీపంలోని సుమతి రెడ్డి ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ సెల్, ఐఐఐసీలు సంయుక్తంగా వేర్ క్రియేటివిటీ మీట్స్ టెక్నాలజీ అనే అంశంతో ప్రాజెక్ట్ ఎక్స్ పో 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థినులు తమ సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలతో రూపొందించిన పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. సృజనాత్మకత ఆవిష్కరణ దృక్పథంతో సాంకేతిక పరిజ్ఞానం పై ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థినీవిద్యార్ధులు చదువుతో పాటు ప్రాజెక్టుల పై ఎక్కువ దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రాజెక్ట్ ఎక్స్ పోలో ప్రదర్శించిన ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు ప్రధానం చేశారు. కన్వీనర్ గా సీఎస్ఈ విభాగాధిపతి ఇ సుదర్శన్, కో కన్వీనర్ గా ఏం రంజిత్ కుమార్, కోఆర్డినేటర్ గా పి. ప్రత్యూష రెడ్డిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు అధ్యాయక బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.
