ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) వరుసగా మూడో ఏడాది సైమా అవార్డు (SIIMA award)ను గెలుచుకుని హ్యాట్రిక్ సాధించారు. ఈ అవార్డును అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, తనకు నిరంతరం ప్రేమను, గుర్తింపును అందిస్తున్నందుకు సైమా వారికి ధన్యవాదాలు తెలిపారు.
తన ఈ విజయం వెనుక దర్శకుడు సుకుమార్ (director Sukumar) ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. అలాగే, ఈ విజయంలో భాగమైన ‘పుష్ప’ (Pushpa) చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు (technicians), నిర్మాతలు (producers), ఇతర సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నారు.