NZB | పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించండి…

  • కేంద్ర గృహనిర్మాణ,పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసిన ఎంపీ ఎమ్మెల్యేలు


నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 4(ఆంధ్రప్రభ) : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ను ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనా రాయణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్ లు కోరారు. శుక్రవారం ఢిల్లీ నిర్మాణ్ భవన్ లోని కేంద్ర గృహని ర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి కటికి తల శ్రీనివాస్ ఐఏఎస్ ని ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల నిజామాబాద్ పట్టణాల పురోగతిపై కార్యదర్శితో చర్చించారు.

ఇందూర్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నగర సుందరీకరణ, రోడ్స్, పార్క్స్ వంటి నిర్మాణాల అంశాలపై కూడా చర్చించారు. ఇందుకు ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పట్టణాల అభివృద్ధికి కావాల్సిన‌ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రధాన కార్యదర్శి తెలిపినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిసినట్లు తెలిపారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో ఇందూర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకులు మొరెపల్లి సత్యనారాయణ, జ్యోతి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *