Allapalli | సంక్రాంతి పోటీలు..

Allapalli | సంక్రాంతి పోటీలు..

Allapalli, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని రాయిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకే చిన్న పాపయ్య, ఉప సర్పంచ్ పూసం నాగేష్ పాలకవర్గం ఆధ్వర్యంలో వాలీబాల్, ముగ్గుల పోటీ, డ్యాన్స్ పోటీలను నిర్వహించారు. వాలీబాల్, ముగ్గుల పోటీలు, డ్యాన్స్ పోటీలకు గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను మొత్తం టీమ్లకు అందజేయడం జరిగిందని సర్పంచ్ చిన్నపాపయ్య తెలిపారు. శారీరక, మానసిక, ఉల్లాసం దృఢత్వం కోసం క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలను ప్రతిఏట సంక్రాంతికి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియచేశారు. వాలీబాల్ పోటీలను తిలకించేందుకు 3 గ్రామాలు ముత్తాపూరం, ఆర్సిగుంపు, రాయిపాడు క్రీడాకారులు భారీగా తరలివచ్చారు.

ఈ బహుమతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పెండకట్ల కృష్ణయ్య, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వివిధ గ్రామ దొర పటేల్ ఎర్రయ్య, సత్యనారాయణ, నాగేశ్వరరావు, పుల్లయ్య, సురేష్ లకు పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రమాదేవి, రమణ, రాజేందర్, రవికుమార్, సమ్మక్క, నాగేశ్వరరావు, కరుణ, వాలీబాల్ విజేతగా రాయపాడు, రన్నర్ గా ఆర్సి గుంపు నిలిచాయి. కెప్టెన్ సురభాక చంటి, ఊకే రాజేష్ లు బహుమతులు అందుకున్నారు.

Leave a Reply