గిరిజనులకు అక్షయ ఫౌండేషన్ విరాళం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు నిత్యావసర వస్తువులు, బెడ్ షీట్లు,, వస్త్రాలను పంపిణీ చేశారు. చెన్నూరు మండలం అక్కేపల్లి గ్రామ గిరిజన మహిళాలను అక్షయ ఫౌండేషన్ మహిళా సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ సభ్యులు ఉషా సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళలు మారుతున్నా కాలం తో పాటు చైతన్యవంతులై స్వశక్తి గా మారి అన్నిరంగల్లో ముందుండాలని కోరారు.గత ఆరు సంవత్సరాలు గా అక్షయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా లోని మారుమూల ప్రాంత నిరుపేదలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తిరుమల, శ్రీవాణి, పద్మ,రజిత తదితరులు.

Leave a Reply