Akkineni Family Case | నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ
అక్కినేని కుటంబం పరువు నష్టం కేసు
విచారణ ఈ నెల 27వ తేదికి వాయిదా
హైదరాబాద్ – అక్కినేని కుటుంబం వేసిన పరువు నష్టం కేసు నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. గతంలో అక్కినేని కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ భాగంగా ఆమె కోర్టుకు వచ్చారు. విచారణ సందర్భంగా సురేఖ న్యాయవాది తమ వాదన వినిపించారు.. అనంతరం కేసు విచారణను ఈ నెల 27వ తేదికి న్యాయమూర్తి వాయిదా వేశారు.
ఇది ఇలా ఉంటే గతంలో స్టార్ హీరోయిన్ సమంతతో పాటు అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం తప్పు పట్టింది. మరో వైపు నాగార్జున ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశాడు.
తన కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకే కొండా సురేఖ నిరాధార ఆరోపణలు చేశారని నాగార్జున తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సురేఖ క్షమాపణ చెప్పినా, తనపై వేసిన కేసును వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదని అప్పుడే బల్ల గుద్ది చెప్పాడు. అంతేకాకుండా.. కొండా సురేఖపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.. దీనిపైనే నేడు విచారణ జరిగింది.