Akkineni | ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న భాగ్యశ్రీ..?

Akkineni | ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న భాగ్యశ్రీ..?

Akkineni, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భాగ్యశ్రీ.. మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈ అమ్మడు అందం, అభినయంతో ఆకట్టుకుంది. అంతే కాకుండా.. అదిరింది అనేలా డ్యాన్స్ చేసి అందర్నీ మెప్పించింది. ఈ భామ ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ కాకుండానే.. వరుసగా ఆఫర్స్ దక్కిచుకుంది. ఇంకేముంది.. కెరీర్ లో యమా స్పీడుతో దూసుకెళుతుంది అనుకుంటే.. సరైన సక్సెస్ లేక చాలా స్లోగా.. డల్ గా నడుస్తుంది అమ్మడు కెరీర్. ఇదిలా ఉంటే.. భాగ్యశ్రీ.. అక్కినేని ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది…?

భాగ్యశ్రీ బోర్సే.. మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ బోల్తాపడింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ మూడు సినిమాలకు సైన్ చేసింది. ఆ మూడు సినిమాలు ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో.. కింగ్ డమ్ సినిమాలో నటించింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఆ సినిమా పై విజయ్, భాగ్యశ్రీ చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ.. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. భాగ్యశ్రీని బాగా నిరాశపరిచింది.

మిస్టర్ బచ్చన్, కింగ్ డమ్ తర్వాత భాగ్యశ్రీ నుంచి వచ్చిన సినిమా కాంత. ఇందులో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు జంటగా నటించింది. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంత సినిమాలో భాగ్యశ్రీ బాగా నటించిందనే పేరు వచ్చింది కానీ.. ఈ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజైంది. ఇందులో రామ్ కు జంటగా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మహేష్‌ బాబు.పి ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో, అభిమాని మధ్య జరిగే కథాంశంగా రూపొందిన ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ.. కమర్షియల్ గా అనుకున్నంతగా కలెక్షన్స్ మాత్రం రాలేదనేది వాస్తవం.

ఇలా భాగ్యశ్రీ నటించిన సినిమాలు నిరాశపరిచాయే తప్పా.. బ్లాక్ బస్టర్ సాధించలేదు. ఇప్పుడు భాగ్యశ్రీ చేతిలో ఉన్న సినిమా లెనిన్. అక్కినేని అఖిల్ నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాని వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల నాగార్జున గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లినప్పుడు మీడియా అడిగితే.. ఈ సినిమా చాలా బాగా వస్తుందని.. వెరీ వెరీ హ్యాపీ అని చెప్పారు. అయితే.. భాగ్యశ్రీ నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ సాధించలేదు. అందుచేత లెనిన్ సినిమా ఎలా ఉంటుందో..? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజెల్ట్ వస్తుందో అని అక్కినేని అభిమానులు టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. లెనిన్ సమ్మర్ లో రిలీజ్ కానుంది. మరి.. భాగ్యశ్రీ లెనిన్ తో సెంటిమెంట్ కంటిన్యూ చేస్తుందో.. లేకపోతే సెంటిమెంట్ బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధిస్తుందో చూడాలి.

Leave a Reply