Akkineni Akhil | లెనిన్ అఖిల్ ఆశ నెరవేర్చేనా..?

Akkineni Akhil | లెనిన్ అఖిల్ ఆశ నెరవేర్చేనా..?
Akkineni Akhil | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ లెనిన్ (Movie Lenin). ఈ మూవీని మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఇందులో అఖిల్ కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఈ భారీ, క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మరి.. ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంది..? ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Akkineni Akhil | విశేషంగా ఆకట్టుకుంటున్న లెనిన్ సాంగ్..
వారెవా వారెవా.. అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేవారు. ఈ పాటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ (Music Lovers) నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్.థమన్ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో,హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. ఈ సాంగ్ చూస్తుంటే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో జాతరను తలపిస్తూ ఈ సాంగ్ కొనసాగుతుందని అర్థమవుతుంది. దీంతో ఈ సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

Akkineni Akhil | లెనిన్ మే 1న విడుదల..
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో అఖిల్ మాస్ లుక్ బాగుంది. ఈ సినిమాను (Movie) మార్చిలో రిలీజ్ చేస్తామని ఇటీవల నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. అయితే.. ఊహించని విధంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వీడియోలో లెనిన్ సినిమాను మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మేకర్స్ ప్రకటించడం విశేషం. ఫస్ట్ సింగిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం సర్ ఫ్రైజ్ అని చెప్పచ్చు. అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించాలని ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. మరి.. అఖిల్ ఆశించిన విజయాన్ని లెనిన్ అందిస్తుందో లేదో చూడాలి.

