Akhanda 2 | న్యూ రిలీజ్ డేట్ అప్ డేట్..
Akhanda 2, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలకృష్ణ (Balayya) హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ చిత్రం అఖండ 2. ఈ సినిమాని ప్రకటించినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వస్తుందని ఎదురు చూసిన నందమూరి అభిమానులు, సినీ అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రీమియర్స్ క్యాన్సిల్ అయినా.. 5న మార్నింగ్ షోలతో అయినా రిలీజ్ అవుతుంది అనుకుంటే.. అదీ జరగలేదు. దీంతో బాలయ్య సినిమాకి ఇలాంటి పరిస్థితా అంటూ అభిమానులు కొన్ని ఏరియాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ న్యూ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చింది.
అఖండ 2 రిలీజ్ కోసం శాయశక్తులా కృషి చేశాం. అయితే.. ఎంత ప్రయత్నించాన సాధ్యపడలేదు. కొన్ని సార్లు ఊహించని విషయాలు చోటు చేసుకుంటాయి. ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, సినీ ప్రేమికులకు క్షమాపణలు చెబుతున్నాం. ఈ కఠిన సమయంలో మాకు అండగా నిలిచిన బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలు అని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ (14 Reels plus) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్ ఏంటంటే.. నెక్ట్స్ వీక్ లో అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదీ కుదరకపోతే రెండు వారాల తర్వాత అఖండ 2 థియేటర్స్ లోకి రావచ్చు అని టాక్ వినిపిస్తోంది.

