తమిళ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ సినిమా ‘విడమయూర్చి’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘పట్టుదల’ పేరుతో ఏకకాలంలో విడుదలైంది. కాగా, మాజిజ్ తిరుమెని దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను అందుకుంది.
అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, మార్చి 3న ఈ చిత్రం ప్రసారానికి అందుబాటులో ఉంటుందని డిజిటల్ ప్లాట్‌ఫాం తాజాగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్, ఓం ప్రకాష్, ఎన్బీ శ్రీకాంత్ సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ పై ఎ. సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.