Agriculture Officer Deepthi | యూరియా కొరత లేదు
- ఏవో దీప్తి
Agriculture Officer Deepthi | ఊరుకొండ, ఆంధ్రప్రభ : మండలంలో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ అధికారి దీప్తి అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని రైతు ఆగ్రోసేవ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 27 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మరో 20 మెట్రిక్ టన్నుల యూరియా మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కావలసినటువంటి రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని, రైతులందరికీ సరిపోను యూరియా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఎరువుల డీలర్లు పీఓఎస్ ద్వారానే అమ్మకాలు జరపాలని, రైతు యాసంగి సీజన్ లో ఎన్ని బస్తాలు తీసుకున్నాడనే విషయాన్ని పీఓఎస్ లో వేలిముద్రల ద్వారా తెలుస్తుందని తెలిపారు. మొక్కజొన్నకు ఎకరాకు నాలుగు బస్తాలు, ఇతర పంటలకు ఎకరాకు రెండు బస్తాలు మించకుండా యూరియా విక్రయించాలని తెలియజేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి దుకాణంలో యూరియా పంపిణీ రిజిస్టర్ కచ్చితంగా ఉండాలని, యూరియా కొనుగోలు చేసిన రైతుల పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు డీలర్ వద్ద వాటి ప్రతులు ఉండాలని ఆమె సూచించారు.

