ప్రభుత్వంపై వ్యవసాయ సలహాదారు పోచారం అసంతృప్తి

వర్ని, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీని విడిచి రావడం తాను చేసిన తప్పు అని కూడా ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చునే నిధులు మంజూరు చేయించగలిగేవాడినని తెలిపారు.
సిద్దాపూర్ రిజర్వాయర్‌కు నిధులు విడుదల చేయాలని పదేపదే కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా ఉన్న పోచారం అసంతృప్తి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
