శ్రీనగర్ – జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పహల్గామ్ ఘటన మరువకముందే మరో దాడికి పాల్పడ్డారు. కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై నేటి తెల్లవారుఝామున ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను టెర్రరిస్టులు టార్గెట్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాల్పుల గురించి సమాచారం అందిన తర్వాత వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు..
Again | జమ్మూలో మరోసారి కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు
